logo

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి ఏఐటీయూసీ డిమాండ్



ఈరోజు హిందూపురం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడినది


ఈధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఆంజనేయులు హాజరు కావడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఈఎస్ఐ,పిఎఫ్ అడ్డదారిన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని 220 మందికి సంబంధించిన 494000 రూపాయలు అమౌంట్ను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు

గొల్లపల్లి వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలి


గొల్లపల్లి వాటర్ వర్కర్స్ కు ఆప్కాస్ నందు చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
*ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం కల్పించి నెల నెల రెగ్యులర్గా జీతాలు అందించాలని, గొల్లపల్లి వాటర్ వర్కర్స్ మరియు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ హిందూపురం తాలుకా కార్యదర్శి మారుతి రెడ్డి, ఉపాధ్యక్షుడు సమీవుల్లా, జిలాన్, సహాయ కార్యదర్శి నౌషాద్, అన్సార్, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు ముత్యాలప్ప, కార్యదర్శి సిద్ధగిరి సురేష్, కోశాధికారి ఈరప్ప, గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రాజు, కోశాధికారి చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు

4
316 views