వైయస్సార్సీపీకి అండగా రైతన్నలు...
నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
ఆదేశాల మేరకు "అన్నదాత పోరు" కార్యక్రమంలో భాగంగా....
పెనుకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు రైతన్నలతో కలిసి జడలు విప్పిన యూరియా, ఎరువుల బ్లాక్ మార్కెట్ లు కూల్చాలంటూ భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేసిన శ్రీ సత్య సాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, హిందూపురం సమన్వయకర్త శ్రీమతి T N దీపిక గారు, మడకశిర సమన్వయకర్త ఈరలకప్ప గారు..
రాష్ట్రంలో యూరియా కోసం, ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది..
రైతులు సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు గానీ, వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడుకు గానీ ఏ మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన అచ్చెన్నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హుడేనా? రైతులు ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తుకు రావడం దౌర్భాగ్యం..
చేసిన తప్పిదాలకు లెంపలేసుకుని రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కష్టాలు వారిపట్ల మానవత్వం చూపించాల్సింది పోయి.. ఇంకా అవమానపర చడం దారుణం. రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్లో అధికభాగం ప్రైవేటుకు మళ్లించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అచ్చెన్నాయుడే స్వయంగా చెప్పాడు.
సహజంగా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను 50 శాతం ప్రభుత్వం ఆధీనంలోని మార్క్ ఫెడ్ కు 50 శాతం ప్రైవేటుకు కేటాయిస్తారు. ఈ ఎరువులను మార్కెట్ యార్డుల ద్వారా, పీఏసీఎస్ లు, ఎఫ్పీఓల ద్వారా పంపిణీ చేస్తారు. ప్రైవేటుకు కేటాయించన ఎరువులను ప్రైవేటు దుకాణాల ద్వారా రైతులకు పంపిణీచేస్తారు. పద్ధతి ప్రకారం ఇలా జరగుతుంది.
మరి అలాకాకుండా, మార్క్ ఫెడ్ కు ఇవ్వాల్సిన 50శాతం ఎరువులను తగ్గించి, ప్రైవేటుకు కేటాయించడం అత్యంత దుర్మార్గం..
ప్రైవేటుకు ఇచ్చిన యూరియాను బ్లాక్ చేసి, బస్తా రూ.270 ఉంటే, దాన్ని రూ.450-600కు అమ్ముతున్నారు. అంటే ఒక్కో బస్తామీద రూ.200 నుంచి రూ.300 వరకూ అధికం. రైతుల్ని పీల్చి పిప్పి చేసి, అధిక ధరలకు యూరియాను అమ్మి, వసూలుచేసిన ఆ సొమ్ము ఎవరి జేబులోకి చేరింది..?
ఏటా 6-7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం ఉంటుంది. ఇందులో ప్రైవేటుకే ఎక్కువ పోయింది. అంటే ఒక్కో బస్తామీద రూ.200-300 వేసుకుంటే.. వీళ్లు రైతుల్ని పిండేసి ఎంత సంపాదించారో అర్థం చేసుకోండి..
దాదాపుగా రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకూ స్కాం చేశారు..
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కూడా రాష్ట్రంలో ఎరువుల కొరతలేదని, గతంలో కన్నా ఎక్కువే ఇచ్చామని చెప్తున్నారు. గతంలో కన్నా యూరియా సహా ఎరువులు ఇస్తే రైతులకు ఎందుకు దొరకడంలేదు..
సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్‌లో తగ్గినప్పుడు, ఎరువుల లభ్యత ఎందుకు లేదు..?
పై రెండు విషయాలను చూస్తే ఎరువులను బ్లాక్ తరలించి.. సొమ్ము చేసుకయున్నారని సులభంగా అర్థం చేసుకోవచ్చు..
సమస్య ప్రైవేటు వ్యక్తుల నుంచి వస్తుందని అనుకున్నప్పుడు వెంటనే ప్రభుత్వ విభాగమైన మార్క్ ఫెడ్ కు కేటాయింపులు ఎందుకు చేయలేదు.?మా ప్రభుత్వంలో పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బేకేల సిబ్బంది ప్రతి గ్రామలోనూ ఉన్నారు కదా..? వారి సేవలను ఎందుకు వాడుకోలేదు..?
గతంలో మేం చేసినట్టుగా, ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీ ఎందుకు చేపట్టలేదు..?*
*బయట మార్కెట్ కన్నా రూ.50 తక్కువమే వైయస్కసార్‌సీపీ హయాంలో సప్లై చేశాం. అలా ఎరువుల కంపెనీలతో ఎందుకు మాట్లాడుకోలేదు రైతులకు ఎరువులు అందించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. యూరియా బస్తాలు బస్తాలుగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుంటే కళ్లు మూసుకున్నారు. ఎరువులు దొరక్క రైతు పంటను పాడుచేసుకోవాల్సిన దుస్థితి రావడం...
చంద్రబాబు పాలనలో జరిగిన ఘోర వైఫల్యం ఎరువులను టీడీపీ వాళ్లే దారి మళ్లించి అధిక ధరకు. అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు...
చంద్రబాబుకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు.. కానీ, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని తీసుకొచ్చారు.
మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలులేక రైతులు లబోదిబో మంటున్నారు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబులో కనీస చలనం కలగడం లేదు
వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, ఉల్లి ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు.
ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది.
మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది.
మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు.రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు...
ఏ సీజన్‌లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు.రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు.
రైతుల చెంతకే వాటిని చేర్చాలి. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి. ఎరువులను పక్కదోవ పట్టలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. సహా పంటలకు గిట్టుబాటు ధర అందించాలి. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలి..
వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని వైయస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది..
ఈ కార్యక్రమంలో పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల రైతులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..