అనంతలో హోరెత్తిన ‘అన్నదాత పోరు’
అనంతపురం, సెప్టెంబర్ 09 :
రైతాంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం నగరంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’.. ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి
భారీగా తరలివచ్చిన అన్నదాతలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ
ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు, వైసీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, శింగనమల సమన్వయకర్త శైలజానాథ్, తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి, రాప్తాడు సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఇతర ప్రజాప్రతినిధులు
యూరియా కొరతతో పాటు రైతు సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ కేశవనాయుడుకు వినతిపత్రం