హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
ఎనిమిదేళ్ల తర్వాత హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో 4-1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌత్ కొరియాను మట్టికరిపించింది. వరుస విరామాల్లో టీమ్ ఇండియా గోల్స్ సాధించి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. కొరియా చివర్లో గోల్ సాధించినా ఒత్తిడి పెరిగి చేతులెత్తేసింది. ఈ గెలుపుతో భారత జట్టు వరల్డ్ కప్ బెర్త్ ఖరారు చేసుకుంది.