
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పంద్దలు రద్దు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కి వినతి
రాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన జీవో నెం.51 వెంటనే రద్దు చేయాలి : ఆదివాసీ గిరిజన సంఘం
అల్లూరి జిల్లలోని అనంతగిరి మండలంలోని చిట్టంవలస,కుసుమవలస, గుజ్జేలి, పెదకోటలోరాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు, జివో 51 రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటి శనివారం అరకులోయ వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రాలు అందిచారు. ఈ మేరకు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ... చిట్టంవలస, కుసుమవలస వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం డ్యాం నిర్మాణం జరిగితే అనంతగిరి, హుకుంపేట,అరకువేలి మండలాల పరిధిలోని భుర్జ పంచాయతీ, వెంగడ, వాలసి, పెదబిడ్డ, టోకూరు, బస్కీ, లోతేరు, గుమ్మకోట పంచాయతీ పరిధిలోని 120 గిరిజన గ్రామాలలో 10 వేల మంది ఆదివాసులు జలసమాధి అవుతాయని తెలిపారు. కావున తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు రద్దు చేయాలని, 1/70 చట్టం, పీసా, అటవి హక్కుల చట్టానికి వ్యతిరేకంగా అదానీ, నవయుగ ప్రైవేటు సంస్థలను అప్పజెప్పడం చట్టవిరుద్ధమని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పీ.బలదేవ్, హైడ్రో పవర్ ప్రాజెక్టువ్యతిరేక పోరాటకమిటి కన్వీనర్ మజ్జి సురేష్ కుమార్, కో కన్వీనర్ మజ్జి కృష్ణం రాజు, భుర్జ పంచాయతీ ఎంపీటీసీ మజ్జి హరి, పోరాట కమిటి నాయకులు కొర్ర బొంజుబాబు, సుంకరమెట్ట పంచాయతీ చర్పంచ్ జి.చిన్నబాబు భుర్జ పంచాయతీ గ్రామస్తులు పీసా కమిటి సభ్యులు పాల్గొన్నారు.