logo

కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు చర్యలు: మంత్రి సంధ్యారాణి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంకు అరకులోయ వచ్చిన మంత్రి సంధ్యారాణి కాఫీ బెర్రీ బోరర్ సోకిన అరకులోయ మండలం లోని పకనకుడి గ్రామంలోని కాఫీ తోటలను శనివారం సందర్శించారు. అరకు ప్రాంతంలో కాఫీ పంటలో ఇటీవలే కనిపించిన కాఫీ బెర్రీ బోరర్ తెగులు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ కాఫీ బెర్రీ బోరర్ తెగులు నివారణకు తెగులు సోకిన కాఫీ పండ్లను వేడినీలల్లో ఉడకబెట్టి అనతరం తీసిన గుంతలో పాతి పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం 80 ఎకరాల కాఫీ తోటలో కాఫీ బోరర్ తెగులు గుర్తించినట్లు కాఫీ బోర్డు, ఉద్యాన శాఖ గుర్తించినట్లు మంత్రి తెలిపారు, ప్రస్తుత నివారణ చర్యలను మరో మూడు సంవత్సరాలు కొనసాగుతాయని ఆమె తెలిపారు. ఈ తెగులు సోకి తుంచిన కాఫీ పండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. కాఫీ బెర్రీ బోరర్ అనంతం చేయడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని, ప్రజల సహకారం కూడా కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమారు కోరారు. కాఫీ తోట సందర్శనలో మంత్రితో పాటు ఆర్టీసీ ప్రాంతీయ జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, పాడేరు టీడీపీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, ఉద్యాన శాఖ అధికారులు, కాఫీ బోర్డ్ అధికారులు పాల్గొన్నారు.

1
77 views