logo

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శ్రీశైలం శాఖ వారు శ్రీశైల దేవస్థానానికి బొలెరో వాహనం విరాళం.

*ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ వారు శ్రీశైల దేవస్థానానికి బొలెరో వాహనం విరాళం*

దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, శ్రీశైలం శాఖ వారు మహేంద్ర బోలేరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు.గంగాధర మండపం వద్ద మహేంద్ర బోలేరో వాహనాన్ని మరియు సంబంధిత పత్రాలను ఆ బ్యాంకు చైర్మెన్ పి. వి. కె. ప్రమోద్కుమార్రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుగారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మెన్ మాట్లాడుతూ 11.50 లక్షలతో కొనుగోలు చేసిన మహేంద్ర బోలేరో వాహనాన్ని దేవస్థానానికి అందజేశామని తెలిపారు.కార్యక్రమానికి ముందుగాకార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు వాహనపూజలను నిర్వహించారు.ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ పి.వి. రమణ, శ్రీశైలం బ్రాంచ్ మేనేజరు కె. సుబ్రహ్మణ్యం, సంబంధిత బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.అదేవిధంగా స్వామివారి ప్రధానార్చకులు శివప్రసాద్ స్వామి,దేవస్థానం పర్యవేక్షకులుడి.నాగేశ్వరరావు, దేవస్థానం ముఖ్యభద్రతా అధికారి బి.శ్రీనివాసరావు, ట్రాన్స్పోర్టు విభాగం వర్క్ ఇన్ స్పెక్టర్ యం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

107
3634 views