logo

ఆహార కల్తీ, ఎక్సపైరీ ఉత్పత్తులపై 6.51 లక్షల జరిమానా

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, సెప్టెంబర్6 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ శనివారం తన చాంబర్లో ఆహార కల్తీ, ఎక్సపైరీ ఉత్పత్తులపై విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో మొత్తం రూ.6,51,000 అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు.
మిస్-బ్రాండెడ్ ఉప్పు విక్రయించిన సాయి అంబికా ట్రిపుల్ రిఫైన్డ్ సాల్ట్, సాయి వాసవి ట్రేడర్స్పై రూ.10,000
లైసెన్స్ రీన్యూ చేయని శ్రీ ఆంజనేయ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.50,000
ఎక్సపైర్డ్ చాక్లెట్స్, మిస్-బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ విక్రయించిన అలంకార్ స్వీట్స్ & బేకర్స్పై రూ.1,20,000
ఎక్సపైర్డ్ సన్ డ్రాప్ ఆయిల్ విక్రయించిన మోర్ రిటైల్ లిమిటెడ్పై రూ.2,00,000
సబ్-స్టాండర్డ్ నెయ్యి విక్రయించిన దుర్గా డైరీ, మోడరన్ మార్ట్పై రూ.80,000
ఎక్సపైర్డ్ ఫ్లేవర్స్, ఐస్ క్రీమ్స్ విక్రయించిన విజేత ఫ్రోజెన్ ఫుడ్స్పై రూ.50,000
లైసెన్స్ లేని జామియా హిదాయతుల్ బానాథ్ మదర్సాపై రూ.1,00,000
సబ్-స్టాండర్డ్ టీ డస్ట్ విక్రయించిన న్యూ అభిషేక్ ట్రేడింగ్ కంపెనీ, స్వాతి ఎంటర్‌ప్రైజెస్పై రూ.21,000
సబ్-స్టాండర్డ్ వేరుశెనగ గుళ్లు విక్రయించిన కన్యకా రైస్ & జనరల్ స్టోర్స్పై రూ.20,000
విచారణలో జిల్లా ఆహార తనిఖీ అధికారి ఎన్. రమేష్ బాబు, సహాయ ఆహార నియంత్రణా ధికారి బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.

0
0 views