logo

వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, సెప్టెంబర్6 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ స్టాప్ సెంటర్ (విజయవాడ)లో అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి తిరిగి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం తెలిపారు. అర్హత కలిగిన 18–42 ఏళ్ల వయస్సు గల మహిళలు సెప్టెంబర్ 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలవయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు ntr.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని, గజిటెడ్ అధికారి అటెస్ట్ చేసిన ధ్రువపత్రాలతో పాటు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయం (డోర్ నెం.31-4-29/A, గద్దె పూర్ణచంద్రరావు వీధి, మారుతీనగర్ 2వ లేన్, విజయవాడ)లో స్వయంగా సమర్పించాలి.

0
0 views