
"ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో 27, 28వ స్నాతకోత్సవాలు"
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, సెప్టెంబర్6 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27వ, 28వ స్నాతకోత్సవాలు సెప్టెంబర్ 9న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు జరుగనున్నా యి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, యూనివర్శిటీ కులపతి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహిస్తారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.పి.చంద్రశేఖర్ తెలిపారు, కోవిడ్ కారణంగా నిర్వహించని 2021 (27వ), 2022 (28వ) బ్యాచ్ స్నాతకోత్సవాలను ఇప్పుడు కలిపి నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఈ సందర్భంగా నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్, న్యూ ఢిల్లీలో చీఫ్ కార్డియాక్ సర్జన్ డా.ఓపీ యాదవకు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
27వ స్నాతకోత్సవంలో 53 మంది విద్యార్థులకు 72 మెడల్స్ (55 గోల్డ్, 17 సిల్వర్), 18 క్యాష్ ప్రైజులు, 28వ స్నాతకోత్సవంలో 67 మంది విద్యార్థులకు 84 మెడల్స్ (60 గోల్డ్, 24 సిల్వర్), 20 క్యాష్ ప్రైజులు అందజేయనున్నారు. అదనంగా, 5 మందికి పీహెచ్.డి పట్టాలు, ఒకరికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ప్రదానం కానున్నాయి. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. వి.రాధికా రెడ్డి, ఆర్ & డీ డైరెక్టర్ డా.సూర్యప్రభ, జాయింట్ రిజిస్ట్రార్ (అకడమిక్) కే. నీలిమ, డిప్యూటీ రిజిస్ట్రార్ కే. సుసన్న రామర్స్, ప్రెస్ అండ్ మీడియా కన్వీనర్ ఎమ్.వి. అక్కి రాజు పాల్గొన్నారు.