logo

“ఏఐతో వ్యాపారాభివృద్ధి – ప్రతి కుటుంబం ఒక పారిశ్రామికవేత్త”

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, సెప్టెంబర్6 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తో వ్యాపారావకాశాలు కల్పించేందుకు ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త - ఏఐ ఫర్ ష్యూర్’ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తయారు చేసే పర్యావరణహిత బొమ్మలు, అలంకరణ వస్తువులు, హెర్బల్ ఉత్పత్తులు, మిల్లెట్స్‌తో ఆరోగ్యకర ఆహార పదార్థాలు, సంప్రదాయ వస్త్రాలు వంటి వాటిని డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికల ద్వారా గ్లోబల్ మార్కెట్‌కు చేరవేయా ల‌ని పిలుపునిచ్చారు. ప్రస్తుతం 700 మంది మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించి “లక్ష్‌పతి దీదీలు” గా ముందడుగు వేసినట్టు వివరించారు. ఇకపై ప్రతి మహిళా వ్యాపారవేత్త AI టూల్స్ సహాయంతో బ్రోచర్లు, రీల్స్, సోషల్ మీడియా ప్రమోషన్లు రూపొందించు కోవడం నేర్చుకుంటున్నారని తెలిపారు. నిట్-వరంగల్ ప్రొఫెసర్ డా.స్ఫూర్తి కూడా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ ఇచ్చారు.

0
0 views