అంబేడ్కర్ భవన్‌లో ఘనంగా గణేష్ మెకానే గారి జన్మదిన వేడుక
అదిలాబాద్: ఈ రోజు అంబేడ్కర్ భవన్‌లో అడ్వకేట్ గణేష్ మెకానే గారి 72వ జన్మదిన వేడుకను MRPS మరియు మాంగ్ సమాజ సభ్యులు ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ మెకానే గారిని సమాజ పెద్దలు, యువతులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, సమాజ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో గుంటే మాధవ్ సార్ గారు ఇటీవల ఉపాధ్యాయ ఉద్యోగానికి పదవి విరమణ పొందినందుకు సమాజ సభ్యులు అభినందించారు. సమాజానికి, విద్యా రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఘనంగా శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, “సమాజ ఐక్యతే అభివృద్ధికి పునాది, మన యువత విద్య, వృత్తి, సేవా రంగాల్లో ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్యాల స్వామి , నక్క రాందాస్, మల్యాల మనోజ్, ప్రసన్న రాజకుమార్ గోప్లే, సాంబశివరావు జాదవ్, బాగ్మారే దత్త తదితరులు పాల్గొన్నారు.