logo

వినాయక నిమజ్జనం పర్యవేక్షణగోదావరిఖనిలో వినాయక నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా.

పవర్ తెలుగు దినపత్రిక పెద్దపల్లి, సెప్టెంబర్ 5, 2025: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో వినాయక నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కరుణాకర్ మరియు గోదావరిఖని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌తో కలిసి క్షుణ్ణంగాపర్యవేక్షించారు.గోదావరి నది వంతెన వద్ద భారీ సంఖ్యలో ప్రజలు నిమజ్జనంలో పాల్గొన్న దృష్ట్యా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కమిషనర్ శ్రీ ఝా, నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు ఈ సందర్బంగా, నది వద్ద భద్రతా చర్యలను, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారని, వారి సహకారంతో ఈ ప్రక్రియ ప్రశాంతంగా, సురక్షితంగా సాగిందని ఆయన తెలిపారు.

0
46 views