logo

అంబేద్కర్ కాలనీలో ఘనంగా గణేష్ నిమజ్జనం

పవర్ తెలుగు దినపత్రిక:మందమర్రి, సెప్టెంబర్ 5: మందమర్రి మూడో వార్డులోని అంబేద్కర్ కాలనీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు మరియు కాలనీ వాసులు కలిసి గణనాథుడి నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు గణేష్ ఉత్సవాల సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన గణేశుడి మండపం వద్ద ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగించారు. డప్పుల వాయిద్యాలు మరియు పాటల మధ్య గణనాథుడి నిమజ్జన కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులైన దాసరి రాజనర్సు దాసరి శ్రావణ్ దాసరి ఎల్లరం, సంసాని దొరబాబు, రామారావు, దాసరి రాజు, దాసరి సాయి, వేల్పుల సాయి, దాసరి తిరుపతి, మరియు సదానందం పాల్గొన్నారు. వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది.

0
77 views