
వికలాంగుల పిల్లలకు బోధించే స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలి.
*ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయినా 2024 లో డీఎస్సీ రాసి మెరిట్స్ కోర్స్ సాధించిన వికలాంగుల పిల్లలకు బోధించే స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగ నియమక పత్రాలు అందజేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్*
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయినా 2024 లో డీఎస్సీ రాసి మెరిట్స్ కోర్స్ సాధించిన వికలాంగుల పిల్లలకు బోధించే స్పెషల్ బిఈడి అభ్యర్థులకు ఉద్యోగ నియమక పత్రాలు అందజేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్న ఉపాధ్యాయుడు భారత తొలి ఉపరాష్ట్రపతి అయినా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం వద్ద ఆయన జయంతి సందర్భంగా సంఘం నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్య సమాజానికి పునాది అని మరియు ఉపాధ్యాయులు దాని రూపశిల్పులు అని విశ్వసించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన డీఎస్సీ ఎగ్జామ్లో స్పెషల్ బిఈడి అభ్యర్థులకు వందశాతం రిక్రూట్మెంట్ చేయవలసి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 30% రిక్రూట్మెంట్ చేసి 70% ప్రమోషన్లు కేటాయించడం వల్ల అర్హత ఉన్న ఎగ్జామ్లో మెరిట్ స్కోర్ సాధించిన అనేకమంది వికలాంగుల విద్యార్థులకు బోధించే స్పెషల్ బిఈడి అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తప్పుడు నియామకాల వల్ల ఉద్యోగ అవకాశాలు రాక తీవ్ర ఆవేదన చెందుతున్నారని వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవతా దృక్పథంతోని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని ఇప్పటికే 2024 లో డీఎస్సీ ఎగ్జామ్ రాసి మెరిట్ స్కోర్ సాధించి ఉన్న వికలాంగుల పిల్లలకు బోధించి స్పెషల్ బీఈడీ అభ్యర్థులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో స్పెషల్ మీడియా అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ దివ్యంగా సంఘం నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు