డాక్టర్ సాప పండగకి సన్మానించిన నందిపేట విద్యార్థులు:
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన కానుగుల చైతన్య, కానుగుల సందీప్ అనే విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో భైంసాకు విచ్చేసి,తమకు తెలుగు విషయం బోధించడమే కాకుండా, విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువల గురించి, ఆసక్తి గల రంగం గురించి, పట్టుదల గురించి అప్పుడు నూరి పోయడం వల్లనే, చైతన్య తనకు ఇష్టమైన పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను అన్నది. అదే విధంగా సోదరుడు కానుగుల సందీప్ స్వయం ఉపాధి పొందుతూ ఆనందంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానుగుల చైతన్య భర్త భూమేశ్వర్, సందీప్ భార్య అక్షర వారి కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు