logo

డాక్టర్ సాప పండరి కి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశం పత్రం అందించిన ఎస్. జె .డబ్ల్యూ. హెచ్. ఆర్. సి. నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్:

శుక్రవారం హైదరాబాదులో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా, ప్రవృత్తిలో మానవసేవయే మాధవ సేవగా భావించి, సామాజిక సేవలు చేయడమే కాకుండా ~వృత్తిలో ఉపాధ్యాయులుగా డాక్టర్ సాప పండరి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పాఠశాలలలో, జూనియర్ కమ్ డిగ్రీ కళాశాలలో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, నందిపేట్, భైంసా, మూడు జిల్లాలలో ఎంతో మంది విద్యార్థులకు చక్కటి విద్యను అందించి, ఎందరో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చే గుర్తించబడిన సార్వత్రిక విద్యలో భాగంగా నిరక్షరాస్యులైన వారికి, బడి మధ్యలో మానేసిన మహిళలకు, యువకులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ద్వారా ఉన్నత చదువులు మళ్లీ వాళ్ళను చదువుకునేటట్టు చేయడమే కాకుండా, ఆశ వర్కర్లుగా, ఏ.ఎన్.ఎం.లు గా వీ.ఆర్. ఓ లుగా, ఆర్మీలో ఇలా ఎన్నో ఉద్యోగాలు సాధించారని నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ తెలుపుతూ, డాక్టర్ సాప పండరికి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంస పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్రావు ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.

5
486 views