ఆళ్లగడ్డ. సేంద్రియ ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన సదస్సు
నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ తాలూకా దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నే గ్రామంలో శుక్రవారం రోజున సేంద్రీయ ఎరువుల వాడకం గురించి రైతు సదస్సును వీఏఎల్ ఆగ్రో టెక్ మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ చిన్న ఓబయ్య ఆధ్వర్యంలో రైతుల పొలాల వద్దకు వెళ్లి రసాయనిక ఎరువుల వాడకంపై కలిగే అనర్థాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పంట సాగులో రసాయనిక ఎరువులను మోతాదుకు మించి వాడటం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువుల వాడకంపై కలిగే ప్రయోజనాలను గురించి రైతు సదస్సుల ద్వారా వివరిస్తున్నాయని అభివృద్ధి అధికారి ఓబయ్య అన్నారు. పంట దిగుబడులు చక్కగా ఉండాలంటే సేంద్రియ ఎరువుల మేలని చిన్న ఓబయ్య వివరించారు.