logo

నాగర్‌కర్నూల్ జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ అధికారికంగా ప్రకటింపు*_


నాగర్‌కర్నూల్: తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీని నేడు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు *బత్తిని సుదర్శన్* మాట్లాడుతూ –
“కొత్తగా ఏర్పడిన జిల్లా కమిటీ, ఫార్మసీ అధికారుల సమస్యల పరిష్కారం, సంఘ బలోపేతం, సభ్యత్వ విస్తరణలో చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర కమిటీ ఆశిస్తోంది. జిల్లాలోని ప్రతి ఒక్క ఫార్మసీ అధికారుల సభ్యత్వ విస్తరణ పూర్తి చేసి, వివరాలను రాష్ట్ర కమిటీకి సమర్పించాలి” అని సూచించారు.
నూతన కమిటీ రెండేళ్లపాటు సేవలందిస్తారని ఈ సందర్భంగా *అధ్యక్షుడు సురేష్, సెక్రటరీ శ్రీనివాసులు, కోశాధికారి డి. కుమార్,* మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన *ఎం. సురేష్ కుమార్* మాట్లాడుతూ –
“రాష్ట్ర కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ, ప్రభుత్వ ఫార్మసీ అధికారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాము. ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శ్రీ బత్తిని సుదర్శన్ గారికి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా ఫార్మసీ అధికారుల ఐక్యతను పెంపొందించేందుకు, వారి హక్కుల సాధన కోసం మా కమిటీ నిరంతరం కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు.

`కొత్తగా నియమిత కమిటీ సభ్యులు`

*అధ్యక్షుడు:* ఎం. సురేష్ కుమార్
*కార్యదర్శి:* ఎస్. శ్రీనివాసులు
*కోశాధికారి:* డి. కుమార్
*వర్కింగ్ ప్రెసిడెంట్:* డి. బాలరాజు, ఎం. అనిత
*అసోసియేట్ ప్రెసిడెంట్:* జి. కె. వెంకటేష్
*జాయింట్ సెక్రటరీలు*- భగత్, రజినీ, దిలీప్,
*జోన్ కోఆర్డినేటర్*- రాజశేఖర్,
*ఎగ్జిక్యూటివ్ మెంబర్స్* – రఘు, చంద్రమౌళి, శ్రీకాంత్, రవీందర్, శ్రీనివాసులు , సంపత్ కుమార్, వినోద్ లతో పూర్తి స్థాయి ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీగా బాధ్యతలు స్వీకరించారు.

0
0 views