
గురుదేవుల పాదపద్మములకు ప్రణామాలు.
తెనాలిలోని మమతా నికేతన్ సహచర గురుదేవులతో నేను..
గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు!
తల్లిదండ్రుల తరువాత గురుదేవులను నిత్యం స్మరించుకోవాల్సిందే. ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన నేను దాదాపు ఐదేళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నాను. అదే పంథాలో గుంటూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు 25 బృందాలకు ప్రజా సంబంధాలు, సత్ప్రవర్తనపై శిక్షణ తరగతులు నిర్వహించగలగడం కూడా మహా అదృష్టం. బాపట్ల జిల్లా తిమ్మసముద్రంలోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ ఐదేళ్ల కోర్సు, ఆపై పీవోఎల్ (P.O.L) కోర్సు పూర్తి చేసి, హైదరాబాదులో తెలుగు పండిట్ శిక్షణ కూడా పొందాను.
1982 ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రపత్రిక విలేకరిగా చేరి మరోవైపు మమతా నికేతన్, నెహ్రూ నికేతన్, యూకా నికేతన్ స్కూళ్లలో, శ్రీనివాస ట్యుటోరియల్స్ లోనూ తెలుగు పండిట్ గా పనిచేశాను. ప్రశాంత విద్యావిహార్ కు సలహాదారుగా వ్యవహరించాను. పత్రికలో పనిచేస్తూనే 1985లో ప్రకాశం జిల్లా, ఉలవపాడు సమితి, మొగిలిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 మాసాలపాటు తెలుగు పండిట్ గా పనిచేశాను. ఆపై రాజీనామా చేసి, ఆంధ్రపత్రికకు గుంటూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను.
ఏదిఏమైనా ఇటు జర్నలిజం, అటు ఉపాధ్యాయ వృత్తి నాకు రెండు కళ్ళలాంటివి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ..
– నిమ్మరాజు చలపతిరావు,
63019 24397