logo

పత్తి దిగుమతి సుంకాలను తగ్గించొద్దు. ఇల్లందు డిప్యూటీ తాసిల్దార్ కు ఎస్ కే ఎం వినతి.కేంద్ర ప్రభుత్వం పత్తి

ఇల్లందు AIMA మీడియా :- దిగుమతి సుంకాలను తగ్గించొద్దని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్ కే యం)ఆధ్వర్యంలో గురువారం ఇల్లెందులో డిప్యూటీ తాసిల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ కె ఎం నాయకులు తుపాకుల నాగేశ్వరరావు,నాయిని రాజు,ఆలేటి కిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం, ట్రంప్ తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పత్తి దిగుమతి సుంకాలు తగ్గించడం మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని,పత్తి క్వింటాకు 10075/- రూపాయలు చెల్లించాలని,అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో ఎండి.రాసుద్దిన్,కొక్కు సారంగపాణి,బుర్ర వెంకన్న,రేసు బోసు,కల్తీ సీతారాములు,శ్రీరామ్ కోటయ్య,మండల వెంకన్న, జూలకంటి గాంధీ,పందిర్లపల్లి వీరన్న,గూళ్ల సదయ్య,తేజవత్ లాలు, దేవుల తదితరులు పాల్గొన్నారు.

16
3175 views