logo

జాతీయ వీల్ చైర్ బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక.

నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామానికి చెందిన మునేశ్వర్ బండు గురువారం తెలంగాణ వీల్ చైర్ బాస్కెట్ బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో జరగనున్న జాతీయ స్థాయి దివ్యాంగుల బాస్కెట్ బాల్ పోటీలకు హాజరుకానున్నారు. బండు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు చేరడంతో పలువురు అభినందించారు.

0
60 views