logo

స్టడీ అబ్రాడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించించిన శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్.

నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA ): శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ఒక రోజు సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సుబ్రహ్మణ్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈ సదస్సు ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును మరింత మెరుగుపరుచుకోవడానికి, విదేశీ విద్యను సాధనంగా చేసుకోని,ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను తెలుసుకుని, వాటిని సద్వినియోగం చేసుకోవలని సూచించారు. డేవిడ్ కుమార్, కెరీర్ డెవలప్మెంట్ సెల్ డీన్ మాట్లాడుతూ పరిశోధన, నైపుణ్యం మరియు అంతర్జాతీయ అనుభవం విద్యార్థుల వృత్తి అభివృద్ధికి కీలకమైయినవి. ఈ సెమినార్ ద్వారా వారు కొత్త సంస్కృతులు, విద్యావిధానాలను తెలుసుకుని, తమ దృష్టికోణాన్ని విస్తరించుకోవచ్చు అని పేర్కొన్నారు.సంపత్తి వ్యక్తి శ్రీ రాజీవ్ కాకర్ల (ప్రధాని – ఆపరేషన్స్ మరియు బిజినెస్ డెవలప్మెంట్, గ్లోబల్ డిగ్రీజ్) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విదేశీ విద్య అనేది ప్రపంచ స్థాయి అవకాశాలకు తలుపులు తెరిచే ఒక ద్వారం. విద్యార్థులు తమ కలలను ఎత్తుగా ఉంచుకుని, ఈ వేదికను ఉపయోగించి అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండాలి తెలిపారు.

2
6 views