
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు వినతినిస్తున్న వీహెచ్ పీ నేతలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు వినతినిస్తున్న వీహెచ్ పీ నేతలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. హైందవ శంఖారావం లో తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా ఇటీవల జరిగిన సంఘటన లు భేటీ లో ప్రస్తావనకు వచ్చాయి.
అనంతరం ఒక వినతిపత్రం సమర్పించారు విశ్వహిందూ పరిషత్ నేతలు ఇచ్చారు.
గౌరవనీయ శ్రీ పివిఎన్ మాధవ్ గారికి
బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్
ఆర్యా!
బ్రిటిష్ పరిపాలన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హిందూ సమాజాన్ని నియంత్రించాలంటే వారి దేవాలయాలను నియంత్రణ లోకి తీసుకోవాలనే కుతంత్రం లో భాగంగా దేవాలయాలను వారి ఆధీనంలోకి తీసుకొన్నారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిని దేవదాయ ధర్మదాయ శాఖ ద్వార మన ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి.
హిందువుల అజమాయిషీ నుంచి ప్రభుత్వ అధికారుల నియంత్రణ లోకి వెళ్లిన కారణంగా సరైన దిశలో (ఆదర్శ దిశలో) దేవాలయాల నిర్వహణ లేని విషయము తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘మందిరాల విముక్తికై’ 5 జనవరి 2025 న విజయవాడలో ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభ జరిగింది.
రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొని మందిరాలు విముక్తి జరగాలని వారి మనోగతాన్ని ప్రకటించారు, హిందూ సమాజం కూడా మందిరాలను తీసుకోవడానికి సంసిద్ధమవుతోంది.
దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము ఎండోమెంట్ చట్టాన్ని మార్చి హిందూ సమాజానికి దేవాలయాల్ని అప్పగించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల నియంత్రణ నుండి మందిరాలు విముక్తి జరగాలని చాలా కాలంగా ఉద్యమిస్తూ ఉన్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయంలో కలిసి వివరించడం జరుగింది.
మీ నేతృత్వంలో మందిరాలు విముక్తి చేసి అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును అగ్రగామిగాను, ఆదర్శంగాను నిలపవలసిందిగా కోరుతున్నాము.
ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది. దీనిని మీకు అందిస్తున్నాము.
దీనిని పరిశీలించి మీ నాయకత్వంలో ‘మందిరాలు విముక్తి’ జరిగే విధంగా, దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించడానికి మీ నాయకత్వంలో ఈ పనిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని వినతినిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ గోకరాజు గంగరాజు, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి
మిలింద్ పరాండే జీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ - క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవి కుమార్,
ప్రాంత అధ్యక్షులు శ్రీవెంకటేశ్వర్లు, ప్రాంత కోశాధ్యక్షులు దుర్గ ప్రసాద రాజు పాల్గొన్నారు.