రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ సంబంధిత అంశాలపై నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కే అచ్చెన్నాయుడు, సీఎస్ శ్రీ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
#AndhraPradesh