logo

పదవి విరమణ పొందిన పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన తిరుపతి జిల్లా ఎస్పీ గారు

తిరుపతి జిల్లా:-
➡️పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ గారు
➡️మీ సేవలు చిరస్మరణీయం అని కొన్నియాడిన జిల్లా ఎస్పీ గారు
➡️ సుదీర్ఘ కాలం పోలీస్ శాఖకు సేవలందించిన మీకు, మీ సతీమణులకు కృతజ్ఞతలు.
➡️పోలీస్ శాఖ సేవలందించిన మీరు మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా.
➡️ఏ స్థాయి అని కాదు వారికి అప్పజెప్పిన ఉద్యోగం బాధ్యతతో నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకురావాలి
జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.,
ఆగస్ట్ నెలలో పదవీ విరమణ పొందిన ఐదు మంది పోలీసు అధికారులు, సిబ్బందికి నేడు స్థానిక పోలీస్ అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్ నందు వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్., గారు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు వివరాలు:
1. శ్రీ. ఎస్.కె. మూర్తి ఎస్.ఐ-256, తిరుపతి రూరల్ పిఎస్ .
2. శ్రీ. డి.బి. రాజు ఏ.ఎస్.ఐ-2741, పుత్తూరు పిఎస్. తిరుపతి.
3. శ్రీ. కె.రవి, ఏ.ఆర్.ఎస్.ఐ-1181, డి.ఎ.ఆర్ , తిరుపతి.
4. శ్రీ. వి.ఆర్. వెంకటేశ్వర్లు, హెచ్.సి-1167 వెస్ట్ పి.ఎస్ ,తిరుపతి.
5. శ్రీమతి ఈ. నిర్మల, డబ్ల్యు.పి.సి-616 వెస్ట్ పి.ఎస్ , తిరుపతి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారు మాట్లాడుతూ అందరూ దాదాపు 42 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు పోలీస్ శాఖలకు అందించారని మిమ్మల్ని సన్మానించుకోవడం ప్రత్యేకమైన అనుభూతి అని, పోలీస్ శాఖ మరియు మీ కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చారని అభినందిస్తున్నాను.
మీరు పోలిస్ శాఖ పట్ల ఇన్ని రోజులు నుండి మీ అంకితభావం, కృషి మరియు అచంచలమైన నిబద్ధతకు నేను మీకు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం... మీరు మరో కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాలి.
క్రమశిక్షణ, అంకిత భావంతో ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు, మనమంతా ఒకే పోలీసు కుటుంబం అని గుర్తు చేశారు. పోలీసు శాఖలో ప్రజా సేవకే అంకితమై మీ సమయం, శక్తి అన్ని వినియోగించి సుదీర్ఘ కాలంగా సేవలు అందించిన మీకు డిపార్ట్మెంట్ తరపునహృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
పదవీ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.

పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబం లో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ జె. వెంకట్రావు, అదనపులు ఎస్పీపరిపాలన, శ్రీ శ్రీనివాసరావు ఆర్మడ్ రిజర్వు , శ్రీ.రమణారెడ్డి ఆర్.ఐ, శ్రీమతి ఎం. నదియా ఆర్.ఎస్.ఐ గారు పోలీస్ అసోసియేషన్ సభ్యులు మరియు పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. #AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #AndhraPradeshPolice #TirupatiPolice

2
85 views