*తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
*తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు*
*జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రరెడ్డి గారు*
*పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు*
తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండలం, ములకలచెరువు టౌన్ మూడు రోడ్లు కూడలి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రరెడ్డి గారు జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ గారితో కలిసి కేక్ కోసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే పెద్ద ఎత్తున అన్నదానం చేసి, రక్త శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.