శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉపాధి నైపుణ్యాల శిక్షణా కార్యక్రమం..
నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA):
ఉపాధి నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాన్ని మహీంద్ర ప్రైడ్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ లో భాగంగా నాందీ ఫౌండేషన్ సహకారంతో, కెరీర్ డెవలప్మెంట్ సెల్ (CDC) ఆధ్వర్యంలో 25 ఆగస్టు 2025 న విజయవంతంగా ప్రారంభించారు అని ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తెలిపారు.శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సుబ్రహ్మణ్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాలు మా విద్యార్థుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని నాందీ ఫౌండేషన్ మరియు మహీంద్ర ప్రైడ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఉన్న భాగస్వామ్యం వలన, మా కళాశాల విద్యార్థులు తమ విద్యార్హతలకు మించి, విజయవంతమైన కెరీర్ కోసం సిద్ధమవుతున్నారు అని పేర్కొన్నారు.