logo

మన్నూరులో ఘనంగా అన్నాభావు సాఠే 105వ జయంతి వేడుకలు

గూడిహత్నూర్ మండలం మన్నూరు ఎస్‌.సి కాలనీలో క్రాంతి వీర్ లహూజీ వస్తాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాహిత్యరత్న, లోక్ షాహీర్ డాక్టర్ అన్నాభావు సాఠే 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు వైరాగే రామేశ్వర్, దయానంద్ గోట్ముక్లే, మాధవ్ కాంబ్లే, మారుతి మోరే, కాంబ్లే గణేష్ మరియు గ్రామ పెద్దలు, యువత, పాల్గొని ఆయనకు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ వక్తలు—"అన్నాభావు సాఠే రచనలు పీడిత, అణగారిన వర్గాలకు వెలుగునిచ్చాయి. మంగ్ సమాజం అభివృద్ధికి విద్య, ఐక్యత, ఆత్మవిశ్వాసం అత్యవసరం" అని సూచించారు.

10
975 views