మన్నూరులో ఘనంగా అన్నాభావు సాఠే 105వ జయంతి వేడుకలు
గూడిహత్నూర్ మండలం మన్నూరు ఎస్.సి కాలనీలో క్రాంతి వీర్ లహూజీ వస్తాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాహిత్యరత్న, లోక్ షాహీర్ డాక్టర్ అన్నాభావు సాఠే 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు వైరాగే రామేశ్వర్, దయానంద్ గోట్ముక్లే, మాధవ్ కాంబ్లే, మారుతి మోరే, కాంబ్లే గణేష్ మరియు గ్రామ పెద్దలు, యువత, పాల్గొని ఆయనకు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ వక్తలు—"అన్నాభావు సాఠే రచనలు పీడిత, అణగారిన వర్గాలకు వెలుగునిచ్చాయి. మంగ్ సమాజం అభివృద్ధికి విద్య, ఐక్యత, ఆత్మవిశ్వాసం అత్యవసరం" అని సూచించారు.