
విశ్వబ్రాహ్మణులకు లోకేష్ క్షమాపణ చెప్పాలి -నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు డిమాండ్
విజయవాడ: ఆగస్టు 30 ఆకార్ష్ టీవీ
విశ్వబ్రాహ్మణ కులస్తుల జన్మ హక్కు అయిన స్వర్ణకార కులవృత్తిని వేరొకరి కులవృత్తి అని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం శోచనీయ మని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ శనివారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగిన చేనేత కార్మికుల సభలో పద్మశాలి కులస్తులకు రెండు కులవృత్తులు ఉన్నాయని, ఒకటి చేనేత, రెండు స్వర్ణకార వృత్తి అని ప్రకటించారని తెలిపారు. అవగాహన రాహిత్యంతో మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల ఆత్మస్థైర్యా న్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో తనకు ఓటు వేసిన ఒక సామా జిక వర్గానికి మేలు చేయడం కోసం వేల సంవత్సరాల నుండి వారసత్వ సంపద అయిన స్వర్ణకార వృత్తిని వేరొకరికి ప్రకటించడం బాధాకరమన్నారు. మంత్రి నారా లోకేష్ తక్షణం స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉద్యమ బాట పడతామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్యవేదిక కో కన్వీనర్ కొమ్మోజు రమేష్ , రాష్ట్ర నాయకులు గోకవరపు శ్రీనివాస్, నక్క చైతన్య, , తదితరులు పాల్గొన్నారు..