logo

బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాయ,మరాఠీల రాజకీయాలను ప్రజలు నమ్మొద్దు **బహుజనుల అభివృధి,సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఎస్పీకి అధికారం ఇవ్వండి.

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** చర్ల మండలం***( ఆగస్టు 31 ఏఐఎంఏ) మీడియా ప్రతినిధి


భద్రాచలం రామయ్యను మోసం చేసిన రాజకీయ పార్టీలను ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించాలి.

అభివృద్ధి నిరోధక శక్తిగా మారిన తెల్లం వెంకటరావు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి

బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాయ,మరాఠీల రాజకీయాలను ప్రజలు నమ్మొద్దు

బహుజనుల అభివృధి,సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఎస్పీకి అధికారం ఇవ్వండి.

బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్

చర్ల మండలం కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ హాజరు అయ్యారు. ఈసందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భద్రాచలం రామయ్య ఆలయ అభివృద్ధికి మరియు భద్రాచల నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామని సాక్షాత్తు రామయ్య సాక్షిగా చెప్పడం జరిగింది 100 కోట్లు కాదు కదా ఒక్క రూపాయి కూడా భద్రాచలం అభివృద్ధికి రామయ్య గుడి అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదని పేర్కొన్నారు వరదల సమయంలో కేసీఆర్ పర్యటన చేసి వరద బాధితుల సమస్య పరిష్కారం కోసం కరకట్ట పునర్నిర్మాణం కోసం భద్రాచల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ 1000 కోట్లు ఇస్తామని ప్రగల్బాల పలికారు ఏమీ ఇవ్వకుండా సాక్షాత్తు భద్రాచలం శ్రీరామచంద్రుని, మరియు భద్రాచలం ప్రజలను మోసం మోసం చేసి బిఆర్ఎస్ పాపం కట్టుకుందని తెలిపారు భద్రాచలం రామయ్యను మోసం చేసినందుకే ఎన్నికల్లో ఓటమి పాలైందని అన్నారు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి కల్లబొల్లి కబుర్ల తోటి ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల పరిపాలనలో ఏమి చేయకుండా ఇప్పుడు మళ్లీ మాకు అధికారం ఇవ్వండి అని అంటున్నారు ప్రజలు ఈ రాజకీయ కుట్రలను గమనించాలని కోరారు ప్రస్తుత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని రామయ్య సన్నిధిలో ప్రమాణం చేసి మాట తప్పడనీ భగవంతుని సైతం మోసం చేసే ఘనులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారనీ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు నియోజకవర్గ అభివృద్ధి నిరోధక శక్తిగా తయారయ్యాడని నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి భద్రాచల నియోజకవర్గంలో ప్రయాణించిన ప్రజలు గుంతల రోడ్లు చూసి బెంబేలెత్తి పోతున్నారని విమర్శించారు భద్రాచలం కున్న గౌరవ మర్యాదలను చెడగొట్టడానికి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కు ఎవరు హక్కు ఇచ్చారని మండిపడ్డారు ఇసుక లారీలు ప్రజలను గుద్ధి చంపడానికేనా ప్రజలు తెల్ల వెంకటరావుని ఎమ్మెల్యేని చేసింది అని ప్రశ్నించారు ఇసుక లారీల కారణంగా రోడ్లపై ఏర్పడ్డ గుంతల కారణంగా జరుగుతున్న ప్రమాదాలకు పోతున్న ప్రాణాలకు తెల్లo వెంకటరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఈ మాయల మరాఠీ రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలని అన్నారు నిరంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ మత మైనారిటీ ప్రజలైన బహుజనుల అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం భారత రాజ్యాంగ రక్షణ కోసం పాటుపడుతున్న బీఎస్పీకి ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇవ్వాలని తద్వారా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించునీ నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి సామల ప్రవీణ్, చర్ల మండల పార్టీ అధ్యక్షులు కొండా కౌశిక్ , చర్ల మండలం ఉపాధ్యక్షులు చెన్నo మోహన్, మండల కార్యదర్శి గుర్రాల విజయ్ కుమార్, పార్టీ మండల కోశాధికారి ఎస్కే జహురిదీన్ భాష చర్ల సెక్టార్ కార్యదర్శి కోటిపల్లి వాసు, పార్టీ నాయకులు చెన్నం పవన్ తదితరులు పాల్గొన్నారు.

56
1900 views