logo

సిరిసిల్ల వరద బాధితులకు బండి సంజయ్ రూ.10 లక్షలు

*సిరిసిల్ల వరద బాధితులకు బండి సంజయ్ రూ.10 లక్షల సాయం*

కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన

ఎంపీ లాడ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్వరలోనే అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో భారీ ఎత్తున నష్టం సంభవించిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించిందని, పలువురు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లాడ్స్ నిధుల మొత్తాన్ని సిరిసిల్ల జిల్లా బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

21
626 views