logo

నంద్యాల మీదుగా తిరుపతికి వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు:నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

నంద్యాల రిపోర్టర్ /మోహన్ (AIMA MEDIA): నంద్యాల రైల్వే స్టేషన్ మీదుగా తిరుపతి పుణ్య క్షేత్రంకు తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుంచి తిరుపతి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుండి చర్లపల్లికి స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు సెప్టెంబర్ 9 వ తేదీన ప్రారంభమౌతుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం తెలిపారు. తన అభ్యర్థన మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీ కారణంగా వారంతపు చర్లపల్లి _ తిరుపతి_చర్లపల్లిస్పెషల్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ నెలలో 9 వ తేదీ నుండి నవంబర్ 25 వ తేదీ వరకు రైలు నెంబర్ 07013 ప్రతి మంగళవారం చర్లపల్లి లో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి నల్గొండ, పిడుగురాళ్ల, మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాలకు బుధవారం ఉదయం 5:30 గంటలకు వచ్చి, మళ్ళీ 5:35 గంటలకు తిరుపతికి కోవెలకంట్ల మీదుగా వెళుతుందనీ, రైలు నెంబర్ 07014 తిరుపతి_ చర్లపల్లి మళ్ళీ తిరుపతిలో ప్రతి బుధవారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 10:25 గంటలకు చేరుకొని చర్లపల్లికి బయలదేరి గురువారం ఉదయం 8:00 గంటలకు చేరుతుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో మొత్తం 12 ట్రిప్పులు ఈ ప్రత్యేక వారాంతపు రైలు తిరుగుతాయని, ఈ స్పెషల్ ఎక్స్ ప్రెస్ లు ఏర్పాటు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధన్యవాదములు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ లోని రైలు ప్రయాణికులు ఈ వారంతపు స్పెషల్ ఎక్స్ప్రెస్ లను ఉపయోగించాలనిఆమె కోరారు.

23
547 views