logo

గౌరు వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీపి సభ్యులు.

నంద్యాల జిల్లా /గడివేముల (AIMA MEDIA):
గౌరు వెంకట్ రెడ్డి జన్మదినం సందర్బంగా గడివేముల మండలం ఐటీడీపి సభ్యులు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఐటీడీపి మండల అధ్యక్షులు బివిఎన్ రాజు మాట్లాడుతూ రాయలసీమ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ప్రజానేత, ఫ్యాక్షన్ గడ్డపై అభివృద్ధిని పరుగులు పెట్టించిన ప్రగతి ప్రదాత నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల ప్రజల భాగ్య విధాత.. భావి తరాలకు స్పూర్తి ప్రదాత, రాయలసీమ టైగర్, నందికొట్కూరు టీడీపీ ఇన్ చార్జి, శ్రీ గౌరు వెంకట రెడ్డి జన్మదినం సందర్బంగా కర్నూల్ క్యాంపు కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఐటీడీపి అధికార ప్రతినిధి బాబు నాయక్, గని ఐటీడీపి అధ్యక్షులు విజయ్, సేవనాయక్, దొరస్వామి,నాయక్ పాల్గొన్నారు.

11
626 views