logo

ఉట్నూర్ మండల వడోని గ్రామంలో ఘనంగా అన్నాభావు సాఠే జయంతి వేడుకలు

ఉట్నూర్ మండలంలోని వడోని గ్రామంలో లోక్ షాహిర్, సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠే 105వ జయంతి వేడుకలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ కమిటీ అధ్యక్షుడు సూర్యవంశీ తాతేరావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, మాంగ్ సమాజ్ యూనిటీ ఫోరం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు కాంబ్లే దిగంబర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గడేకర్ సంజీవ్ (ఉట్నూర్ డివిజన్ అధ్యక్షుడు), విష్ణు మోర్ (లక్సెట్టిపేట్ అధ్యక్షుడు) ప్రత్యేక అతిథులుగా పాల్గొని అన్నాభావు సాఠే గారి జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ, ఆయన రచనలు సమాజంలో నూతన చైతన్యం నింపాయని పేర్కొన్నారు.

వేడుకలలో గ్రామపటేలు,గ్రామ Ex సర్పంచ్,మనోజ్,రాఠోడ్ రాజేష్ నాయక్,జాధవ్ సుభాష్, సూర్యవంశీ బాజీరావ్, తోగ్రే రాందాస్,జేవారే చంద్రకాంత్,గోడ్కే మహేష్, మొదలైన గ్రామసమాజాపెద్దలు,మరియు చిన్నారులు,మహిళలు అత్యంత భారీ సంఖ్యలో పాల్గోని జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అన్నాభావు సాఠే గారి విప్లవాత్మక రచనలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం గురించి గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని వేదికపై నాయకులు వ్యక్తం చేశారు.

39
2381 views