
*ఆరోగ్య గమ్యానికి సైకిల్ సవారీ*
* *పర్యావరణ పరిరక్షణకూ సైక్లింగ్ చేయూత*
- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, ఆగస్టు31 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
ఆరోగ్యం, ఆహ్లాదం ఆపై పర్యావరణ పరిరక్షణకూ సైక్లింగ్ చేయూతనిస్తుందని, చిన్నారు లు, యువత సైకిల్ సవారీని అలవాటుగా చేసుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమరావతి రన్నర్స్ ఆధ్వర్యం లో ఆదివారం నగరంలో పెడల్ ఫర్ ఫిట్నెస్ అండ్ యునిటీ ఇతివృత్తంతో నిర్వహించిన సైకిల్ రైడ్ లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఈ రైడ్ బెంజ్ సర్కిల్, రామవరప్పాడు, బీఆర్టీఎస్ రోడ్డు, గాంధీనగర్, మునిసిపల్ ఆఫీస్, ప్రకాశం బ్యారేజ్, కంట్రోల్ రూమ్, స్టేడియం వరకు మొత్తం 21 కి.మీ. మేర సాగింది. దాదాపు 80 మంది సైక్లిస్టులు ఉత్సాహం గా పాల్గొని ఐక్యతా మార్గంలో క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే సైక్లింగ్ ను హాబీగా మార్చుకొని ముందుకువెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. అందుకే అవగాహ న పెంచుకొని సైక్లింగ్ ను అభిరు చిగా మార్చుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. లండన్ ఎడిన్బర్గ్ లండన్ (ఎల్ ఈ ఎల్) సైక్లింగ్ ఈవెంట్ 2025లో పాల్గొన్న నిషికాంత్ ను కలెక్టర్ అభినందించారు.కార్యక్రమంలో అమరావతి రన్నర్స్ ప్రెసిడెంట్ ఆర్.రమేష్ రవి, సభ్యులు బసవేశ్వరరావు, జీవీ సత్య నారాయణ, నిషికాంత్ తదితరు లతో పాటు సీవైసీవో, డెకథ్లాన్ సైక్లింగ్ క్లబ్స్ సభ్యులు, సిటీ రన్నర్స్ పాల్గొన్నారు.