logo

*సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ*

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, ఆగస్టు31 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం లో ఆదివారం నాడు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజక వర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు కాబడిన చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తంగిరాల సౌమ్య కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని, ముఖ్యంగా ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయనిధి రూపంలో అందిస్తున్న సహాయం ఎంతో మంది జీవితాలకు మేలు చేస్తోందని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం వారి వెన్నంటి నిలబడి తోడ్పాటు అందిస్తుందనే నమ్మకం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజల అవసరా లను గుర్తించి, నేరుగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని ఆమె వివరించారు. సీఎం సహాయనిధి వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొత్త ఆశతో ముందుకు సాగగలుగు తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమం లో లబ్ధిదారులు సీఎం సహాయ నిధి ద్వారా అందుతున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సహకారం తమ జీవితంలో కొత్త వెలుగులు నింపిందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

21
20 views