*పర్యావరణ గణనాథుని ఏర్పాటు సంతోషదాయకం*
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రతినిధి, ఆగస్టు31 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
జగ్గయ్యపేట పట్టణంలోని పాతపేట గడ్డ వద్ద ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గరికతో తయారు చేసిన పర్యావరణ ఘననాథుని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శనివారం రాత్రి గరిక వినాయకు డిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం వద్ద జరుగుతున్న ప్రతిరోజు కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్న తాతయ్య, “మొట్టమొదటి సారిగా జగ్గయ్యపేట పట్టణంలో పర్యావరణ గణనాథుని ఏర్పాటు కావడం సంతోష దాయకం. మైదాపిండి, కాగితం, నీటిలో కరిగిపోయే పదార్థాలతో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్టించడం ఆదర్శప్రాయంగా ఉంది” అని అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మరియు అర్చకులు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకి చింతలపూడి హరి స్వామి వారి శేష వస్త్రాన్ని సమర్పించి, ప్రసాదాలను అందజేశారు.