
పేద, శ్రామిక వర్గాల పెన్నిధి అన్నా భావు సాతె గారు: శ్రీ గజానంద్ నాయక్ గారు,,
తన కవితలతో సామాన్యుల హక్కుల కొరకు పాలకులను ప్రశ్నించిన డా.అన్నా భావు సాఠ్ గారు పేద శ్రామిక వర్గాల పెన్నిధి అని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాణోత్ గజానంద్ నాయక్ గారు అన్నారు. అన్నా భావు సారె గారి 105వ జయంతిని నార్నూర్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. జెండా ఆవిష్కరణ చేసి ఆయన విగ్రహానికి పూల మాలతో శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామ పెద్దలను శాలువతో సత్కరించారు. అనంతరం గజానంద్ నాయక్ గారు మాట్లాడుతూ డా.సారె గారు తన రచనలతో సమాజంలో అవగాహన కల్పించుటకు కృషి చేశారని కొనియాడారు. సమాజ చైతన్యం కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. దేశ విదేశాల్లో పేరు సంపాదించారని అన్నారు. రష్యాతో పాటు పలు దేశాల్లో ఆయన రచనలను గుర్తించి విగ్రహాలు నెలకొల్పారని గుర్తు చేశారు. సారె గారు కోరుకున్న చైతన్య సమాజ నిర్మాణం కొరకు కృషి చేద్దామని కోరారు. కార్యక్రమంలో సీఐ ప్రభాకర్, బీజేపీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జ్ఞానోబా పుష్కర్, మాజీ జడ్పీటీసీ బ్రీజులాల్, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డీ నాయక్, PACS ఇంచార్జ్ చైర్మన్ సురేష్ ఆడే,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన...