logo

పదవి విరమణ పొందిన పోలీసులను సన్మానించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.



పదవి వీరమణ పొందిన పోలీసులను సన్మానించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .

సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.శనివారం పదవి వీరమణ పొందిన కర్నూలు పిసిఆర్ ఎస్సై - పి. నిర్మల దేవి. ఏఆర్ ఎస్సై – పి. బి . పురుషోత్తం లను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీ గారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏ ఆర్ డిఎస్పీ భాస్కర్ రావు , స్పెషల్ బ్రాంచ్ సిఐ కేశవ రెడ్డి, ఆర్ ఐ నారాయణ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

13
195 views