విజయనగరం ఉత్సవాలకు రూ.50లక్షలు: మంత్రి
విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగను అక్టోబర్ 6,7 తేదీల్లో జరిగే పండుగను విజయవంతం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. గతంలో కంటే ఈ ఏడాది పండుగను మరింత దిగ్విజయంగా నిర్వహించాలన్నారు.
విజయనగరం ఉత్సవాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. పైడితల్లమ్మ పండుగను, విజయనగరం ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.