గోదావరిలో స్నానానికి దిగిన వ్యక్తి మృతి: యలమంచిలి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గ్రామానికి చెందిన వేగి మోహనరావు (42) అనే వ్యక్తి ఈనెల 25వ తేదీన చించినాడ పుష్కరఘాట్ వద్ద స్నానానికి దిగి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయారని ఎస్సై కె గురయ్య తెలిపారు. మృతదేహం గురువారం దర్భరేవువద్ద గోదావరిలో లభ్యమైందని తెలిపారు.