logo

ఏ పదవి లేకుండా 15 ఏళ్లు బతికాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

AIMI న్యూస్ బ్యూరో విశాఖపట్నం. జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేనతో సేనాని. విశాఖపట్నం లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు గురువారం సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు వివిధ నియోజకవర్గాల నుండి దాదాపు 200 మంది కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపై సమావేశంలో వివరణ కోరడం జరిగింది అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధిపై ఆరా తీశారు.ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో 10-15 నిమిషాలు మాట్లాడారు. వారి పనితీరుపై సర్వే చేయించిన పవన్ కళ్యాణ్ రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. జనసేన పార్టీని బలోపేతం చేయడం ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు బాధ్యతగా ఉండాలని తెలిపారు. అలాగే కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిదేశం చేశారు. కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆదేశించారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన మూడు తీర్మానాలను జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఆమోదించారు.ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టాలని అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడో తీర్మానం చేసినట్లు సమాచారం. నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడిందని నా రాజకీయ జీవితంలో 15 ఏళ్లపాటు ఏ పదవి లేకుండా నిరంతరంగా రాజకీయాల్లో కొనసాగాను ఆర్,ఎస్,ఎస్ కార్యకర్తల భావాజాలం మన పార్టీకి స్ఫూర్తిదాయకం.జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయ వాదం ఉందన్నారు.

63
2120 views