
మెదక్ ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం..
సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు
మెదక్ ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు.
మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి సంబంధించి ఎంపీ రఘునందన్ రావు గారు నాలుగు ప్రధాన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వాటిపై ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకున్నారు:
1️⃣ మెదక్ – బూరుగుపల్లి – రాజాపేట – కామారెడ్డి రహదారి
ఈ మార్గంలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిలను ఎత్తు పెంచి, రహదారిని డబుల్ రోడ్‌గా విస్తరించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన సీఎం పంచాయతీరాజ్ రహదారిని ఆర్ & బి పరిధిలోకి మార్చి డబుల్ రోడ్‌గా విస్తరించేందుకు జిల్లా కలెక్టరుకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
2️⃣ పిల్లికోటాల సబ్‌స్టేషన్ (మెదక్)
వరదలతో పూర్తిగా మునిగిపోయిన 33 కెవి సబ్‌స్టేషన్ బదులుగా, కొత్త స్థలంలో మూడు నుంచి ఐదు కోట్ల వ్యయంతో కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు.
సీఎం వెంటనే అధికారులను దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
3️⃣ రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల
వర్షాల కారణంగా 350 మంది విద్యార్థినులు ప్రైవేట్ భవనంలో ఇబ్బందులు పడుతున్న విషయం ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన సీఎం గారు రామాయంపేటలో కొత్త మహిళా రెసిడెన్షియల్ కళాశాల స్థాపనకు స్థలం కేటాయించి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
4️⃣ రామాయంపేట బస్ డిపో
రామాయంపేటలో పూర్తి హంగులతో కొత్త బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి దీనిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.