logo

యూరియా కోసం రోడ్డెక్కి కన్నెర్ర జేసిన రైతులు


యూరియా కోసం రోడ్డెక్కి కన్నెర్ర జేసిన రైతులు
ప్రభుత్వ వైద్యశాల వద్ద గంట పాటు రాస్తారోకో ,హుటాహుటిన చేరుకున్న ఎం ఎల్ ఏ కోరం కనకయ్య,పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారులు
రాస్తారోకో విరమించిన రైతన్న ఎట్టకేలకు యూరియా సరఫరా చేసిన వ్యవసాయ శాఖాధికారులు, శాంతించిన రైతన్న
గత వారం రోజులుగా యూరియా సరఫరా లేక పోవడం తో ప్రతిరోజూ రైతులు యూరియా కోసం వ్యవసాయ మార్కెట్ కు వస్తూ రోజు సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరుగుతూ సహనం కోల్పోయిన రైతులు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేసిన రైతాంగం. స్థానిక సిఐ తాటిపాముల సురేష్, ఎస్ ఐ హసీనా లు తమ సిబ్బంది తో హుటాహుటిన రాస్తారోకో లో పాల్గొన్న సిపిఎం,నేతల తో చర్చలు జరిపారు ఈ సందర్భంగా పోలీసులతో వ్యవసాయ శాఖ అధికారులను పిలిపించమని నినదించిన రైతులు స్థానిక శాసన సభ్యులు కోరం కనకయ్య,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు వ్యవసాయ శాఖ అధికారులు రాస్తారోకో వద్దకు చేరుకొని ఎట్టకేలకు యూరియా సరఫరా చేస్తాను చెప్పి స్వయంగా ఎం ఎల్ ఏ గారు రైతులను తోడ్కొని పోయి మార్కెట్ యార్డు నందు గల యూరియా ను ప్రతి రైతుకు ఒక్క బస్తా యూరియా చొప్పున పంపిణీ చేయడం జరిగింది.రైతాంగానికి సిపిఎం, సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ నేతలు రైతులకు అండగా నిలబడి యూరియా సరఫరా చేసే వరకు ఉండి ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపిఎం నుండి అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్,తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్, మాస్ లైన్ నేతలు నాయిని రాజు, యాకుబ్ షా వలి, బుర్ర వెంకన్న,మల్లెల వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు.

10
304 views