మదర్ థెరిస్సా 115వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
సత్తెనపల్లి పట్టణంలోని మాతృశ్రీ మొల్లమాంబ వయోవృద్ధాశ్రయంలో మదర్ థెరిస్సా 115వ జయంతి సందర్భంగా సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. సింగరాజు సాయికృష్ణ మదర్ థెరిస్సా చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె సేవాభావాన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో వృద్ధాశ్రయ నివాసితులకు వైద్య పరీక్షలు, మందులు అందించారు. భవిష్యత్తులో కూడా వైద్య సహాయం అందిస్తామని డా. సాయికృష్ణ హామీ ఇచ్చారు. అనంతరం వయోవృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు.