రిజిస్టర్ పోస్ట్ సేవల రద్దుపై ప్రజల్లో గందరగోళం ?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారత తపాలా శాఖ వచ్చే నెల సెప్టెంబర్. 1 వ తేదీ నుండి చేపట్టే రిజిస్టర్ పోస్ట్ రద్దు విషయంలో ఇంతవరకు కూడా జిల్లాలోని ముఖ్య తపాలా కార్యాలయాలకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు అని నిజామాబాద్ నగరంలోని తపాలా శాఖలోని కొందరు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు,కాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న విషయానికి సంబంధించి భారత తపాలా శాఖ తక్షణమే ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా, భారత తపాలా శాఖను జిల్లా ప్రజలు కోరుతున్నారు.