logo

గణపతి ఆగమన్ శోభాయాత్ర 28వ వార్షికోత్సవం కొడిమ్యాల ఎస్సై సందీప్‌కు ప్రత్యేక ఆహ్వానం

కొడిమ్యాల పట్టణంలో వివేకానంద నగర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి శోభాయాత్ర సందర్భంగా 28వ వార్షికోత్సవ ఆగమన్ యాత్ర సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. పాత పోలీస్ స్టేషన్, మెయిన్ రోడ్, వివేకానంద నగర్, కొడిమ్యాల వద్ద ఈ కార్యక్రమం శుభారంభం అయ్యింది.ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సందీప్‌ను వివేకానంద నగర్ యూత్ సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు. భక్తిమయంగా సాగిన యాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు, యువకులు పాల్గొన్నారు. వివిధ కళాకారుల ప్రదర్శనలు, డప్పులు, శంకనాదాలతో శోభాయాత్రను మరింత వైభవంగా నిర్వహించారు.అనంతరం నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, “ప్రతి ఏడాది సమాన ఉత్సాహంతో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది 28.వ వార్షికోత్సవం కావడం గర్వకారణం” అని పేర్కొన్నారు.

13
1060 views
  
1 shares