logo

"న భూతో న భవిష్యతి" అన్నట్టుగా సాగిన "స్వర బృందావనం" సూపర్ మెగా ఈవెంట్ 24 వ సంగీత విభావరి. [ ప్రథమ వార్షికోత్సవం]

కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాదు లో "స్వర బృందావనం" వ్యవస్థాపకులు శ్రీ రవికాంత్ మరియు సహ వ్యవస్థాపకులు శ్రీ శ్రీకుమార్ ల సంయుక్త ఆధ్వర్యాన "స్వర బృందావనం" సూపర్ మెగా ఈవెంట్ 24 వ సంగీత విభావరి గా "ప్రథమ వార్షికోత్సవం" అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడినది.
2024 ఆగష్టు 15 న చిన్నగా ప్రభవించిన "స్వర బృందావనం" అంచెలంచెలుగా ఎదిగి, సంవత్సరం తిరిగేసరికి 24 విభావరులను జరుపుకొని, మూడు పూవులు ఆరు కాయలు గా విస్తరించి, ఈ 2025 ఆగష్టు 24 న "ప్రథమ వార్షికోత్సవం" జరుపుకొంటున్నది. ఈ కార్యక్రమ ప్రచారం కోసం ఘుఖ్యంగా రవికాంత్ 3 ప్రోమోలు, 3 లైవ్ లు, 1టీజర్ తయారుచేశారు. చాలామంది వీక్షించారు. ఆ కష్టం ఈ మెగా ఈవెంట్ లో ప్రతిఫలించింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక స్లాట్ గా, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఒక స్లాట్ గా విభజించి ప్రసారం చేయడం జరిగింది. ప్రేక్షకుల, గాయనీ గాయకుల అభ్యర్థన మేరకు రాత్రి 10 గంటల వరకు పొడిగింపబడినది. ఈ కార్యక్రమం ఇప్పటికి 1100 వ్యూస్ తో అలరారుతోంది.
కార్యక్రమం ఉదయం 9 గంటల కు రవికాంత్ వినాయక ప్రార్థన తో ప్రారంభమైనది. తరువాత శ్రీకుమార్ సీతాకుమారి కొండకోనలోన అంటూ, రఘుబాబు శేషశైలావాస అంటూ స్వామిని కార్యక్రమానికి రప్పించారు. గాయనీ గాయకులందరు అంకిత భావంతో కృషిచేసి ఇదివరలో పాడినవి కాకుండా పాత కొత్త ల మేలికలయిక మరియు వెరైటీ పాటలతో ప్రేక్షకుల నలరించారు. స్థానికులే కాక విశాఖపట్నం, భువనేశ్వర్, ఏలూరు, నెల్లూరు, గుర్గావ్ మొదలైన సుదూర ప్రాంతాల నుండి కూడ విచ్చేసి కార్యక్రమాన్ని రక్తి కట్టించడమే కాక, తెలుగు హిందీ పాటలలో ఏ పాటైనా తాము పాడగలమని నిరూపించుకున్నారు. హుషారైనవి, శ్రావ్యంగా సాగేవి, సంగీత పరమైనవి, భక్తి ప్రధానమైనవి అనేక పాటలు పాడి హాయనిపించారు. విధాత తలపున, మంచు కురిసే వేళలో, సరిగమ పదనిస, మధుర మురళి, బ్రోచేవారెవరురా, ప్రణయరాగ వాహిని, ముత్యాలూ వస్తావా వంటి వివిధ రకాల పాటలతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. స్థలాభావం తో చాలా వ్రాయబడలేదు.
ఈ కార్యక్రమం లో శ్రీయుతులు రవికాంత్, శ్రీకుమార్, రాంబాబు, బ్రహ్మానందం, శరత్ కృష్ణ, రఘుబాబు, నాగేశ్వరరావు, వేదవ్యాస్, సురేంద్ర, విజయ రాఘవన్, చైతన్య, రాజ్ కుమార్, శ్రావణ్, సోమయాజులు శర్మ, దీపక్ ప్రభృతులు, మరియు శ్రీమతులు శారద, MS. లక్ష్మి, సీత, సీతాకుమారి, రమాదేవి, రాజేశ్వరి, శ్రీలక్ష్మి, శ్రీదేవి, అభిమైత్రి, సౌజన్య, లక్ష్మీరెడ్డి, వసుధ, యశోద, దూసి శారద ప్రభృతులు అత్యంత ఆనందోత్సాహాలతో పాల్గొని తమ కోకిల కంఠాలతో వీరవిహారం చేశారు.
నిర్వాహకులు రవికాంత్ శ్రీకుమార్ లు గాయనీ గాయకుల కు, వాద్య సహకార బృందానికి భోజన సత్కారాలు ఏర్పాటుచేసి, గాయనీ గాయకుల కు బహుమతుల నందజేశారు. రాత్రి 10 గంటల కు జనగణమన తో కార్యక్రమం ముగిసింది.
.

183
4659 views